kcr: కేసీఆర్ గజగజ వణకాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • 12వ తేదీన మహాకూటమి ప్రమాణస్వీకారం చేస్తుంది
  • గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పిస్తాం
  • బోయకురుమలను ఎస్టీలలో చేర్చడానికి కృషి చేస్తాం

7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని, 11న ఫలితాలు వస్తాయని, 12వ తేదీన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ల నేతృత్వంలోని మహాకూటమి ప్రమాణస్వీకారం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గద్వాల సభలో మాట్లాడుతూ తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనులకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను తీసుకొస్తామని చెప్పారు.

వాల్మీకి బోయలను కేసీఆర్ మోసగించారని... బోయకురుమలను ఎస్టీలలో చేర్చడానికి తమ కూటమి కృషి చేస్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు. హస్తం గుర్తుకే మన ఓటు అంటూ నినదించారు. హైదరాబాదులో ఉన్న కేసీఆర్ కు వినిపించేలా గట్టిగా చెప్పాలని... కేసీఆర్ గజగజ వణకాలని అన్నారు.

kcr
uttam kumar reddy
gadwel
congress
  • Loading...

More Telugu News