anasuya: అనసూయ తిరిగొచ్చేసింది .. వర్షిణి గ్లామర్ కి ఫిదా!

- 'జబర్దస్త్' కామెడీ షోకి క్రేజ్
- అనసూయ తప్పుకుందంటూ పుకార్లు
- యూత్ మనసు దోచుకున్న వర్షిణి
బుల్లితెరపై 'జబర్దస్త్' కామెడీ షోకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ షోకి గ్లామర్ తీసుకొచ్చిన ఘనత అనసూయకే దక్కుతుంది. అలాంటి అనసూయ కొన్ని వారాలుగా 'జబర్దస్త్' కామెడీ షోలో కనిపించలేదు. ఆమె స్థానంలో 'వర్షిణి' కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తోంది. సినిమాల్లో అవకాశాలు పెరిగిపోవడంతో, 'జబర్దస్త్' నుంచి అనసూయ తప్పుకుందని వార్తలు ఊపందుకున్నాయి. ఆమె తప్పుకోవడానికి పారితోషికం విషయంలో వచ్చిన తేడాలు అనే టాక్ కూడా బలంగా వినిపించింది.
