bjp kishanreddy: టీఆర్‌ఎస్‌ వెన్నులో వణుకు పుడుతోంది...గెలవమన్న భయమే కారణం: కిషన్‌రెడ్డి

  • రుణమాఫీని కేసీఆర్‌ ఎప్పుడో గాలికి వదిలేశారు
  • తన కేబినెట్‌లో మహిళలకు స్థానం లేకుండా చేశారు
  • పలు చర్యలతో ప్రజల విశ్వసనీయత కోల్పోయారు

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ అధినాయకుడు కేసీఆర్ వెన్నులో వణుకుపుడుతోందని, మళ్లీ గెలుస్తానో లేదో అన్న భయమే ఇందుకు కారణమని బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులకు విశ్వసనీయత ముఖ్యమన్నారు.  తన చర్యలతో అటువంటి విశ్వసనీయతను కేసీఆర్‌ కోల్పోయారని చెప్పారు.

ఎన్నికల ముందు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టాక ఆ విషయాన్నే మర్చిపోయారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్‌ ముందున్నారని ధ్వజమెత్తారు. తన కేబినెట్‌లో కనీసం ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకుండా ఆ వర్గాలను అవమానించారని విమర్శించారు. ఈ చర్యలే టీఆర్‌ఎస్‌లో ఓటమి భయానికి కారణమని చెప్పారు.

bjp kishanreddy
TRS kcr
  • Loading...

More Telugu News