Child marriage: నన్ను గెలిపిస్తే బాల్య వివాహాలు జరిపిస్తా.. రాజస్థాన్ బీజేపీ మహిళా అభ్యర్థి వివాదాస్పద హామీ
- బాల్య వివాహాలను దగ్గరుండి జరిపిస్తా
- పోలీసులు అడ్డుకోకుండా చూస్తా
- దుమ్మెత్తి పోస్తున్న ప్రతిపక్షాలు
రాజస్థాన్ ఎన్నికల బరిలో ఉన్న ఓ బీజేపీ మహిళా అభ్యర్థి ప్రజలకు వివాదాస్పద హామీ ఇచ్చారు. తనను గెలిప్తే బాల్య వివాహాలను దగ్గరుండి గెలిపిస్తానని, పోలీసుల అడ్డంకి లేకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు అవాక్కయ్యారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిసినా ఆమె ఈ హామీ ఇవ్వడంతో వివాదాస్పదమైంది. ఆమె వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యర్థులే కాదు, నెటిజన్లు కూడా ఆమెపై దుమ్తెత్తి పోస్తున్నారు. ఎమ్మెల్యేగా బరిలో ఉన్న వ్యక్తి ఇటువంటి దురాచారాలను ప్రోత్సహించడం ఏంటంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
రాజస్థాన్‌లోని సోజత్ నియోజకవర్గం నుంచి శోభ చౌహాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆదివారం పీపాలియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే బాల్య వివాహాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తానని, పోలీసుల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.