Priyaanka Chopra: నిక్ జొనాస్ చెప్పులు కొట్టేసి 5 లక్షల డాలర్లు అడిగిన పరిణీతి చోప్రా!

  • జోధ్ పూర్ లో వైభవంగా ప్రియాంక, నిక్ వివాహం
  • చెప్పులు దాచేసే వేడుకలో పాల్గొన్న పరిణీతి
  • వరుని బంధువులకు స్వాగతం పలికిన మధు చోప్రా

రాజస్థాన్‌, జోధ్‌ పూర్‌ లోని ఓ ప్యాలెస్ లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా, నిక్‌ జొనాస్ ల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. బెంగళూరు నుంచి వచ్చిన చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలోని 11 మంది పండితులు వీరి వివాహాన్ని జరిపించారు. పెళ్లి వేడుకకు ముందు ప్యాలెస్ లోనే వరుని ఊరేగింపు జరుగగా, వరుని చెప్పులను దాచిపెట్టే వేడుక జరిగింది.

ఇందులో పాల్గొన్న ప్రియాంక కజిన్, మరో నటి పరిణీతి చోప్రా, నిక్ చెప్పులను కాజేసి 5 లక్షల డాలర్లను (సుమారు రూ. 3 కోట్లకు పైగానే) డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఆపై నిక్ బేరానికి దిగి, ఎంతకు తెగ్గొట్టాడన్న విషయం తెలియరాలేదు. ప్రియాంక చోప్రా తరఫున మధు చోప్రా వరుని బంధువులకు స్వాగతం పలకగా, అతిథులకు ఆహారాన్ని సర్వ్ చేసేందుకు 50 మంది దేశ విదేశీ చెఫ్ లు పనిచేయడం గమనార్హం.

Priyaanka Chopra
Nick Zonas
Parineeti Chopra
Chappal
Marriage
  • Loading...

More Telugu News