Chandrababu: నోరు జారి కాంగ్రెస్ ను ఓడించాలన్న చంద్రబాబు... మెంటలెక్కిందని కేసీఆర్ ఎద్దేవా!

  • సోషల్ మీడియాలో వైరల్ అయిన చంద్రబాబు వ్యాఖ్యలు
  • ఏమన్న కిందమీదకు అయ్యిందేమో
  • అంత గతి తప్పి మాట్లాడితే ఎలా?
  • మెంటలయ్యిందేమో చూపీయాలని కేసీఆర్ సెటైర్

ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓ రోడ్ షోలో నోరుజారి కాంగ్రెస్ ను ఓడించాలని కోరగా, ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటినే గుర్తుచేసిన కేసీఆర్, చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"కాంగ్రెస్‌ పార్టీని ఓడియ్యాలని చంద్రబాబు అంటుండు. ఆయనమో కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నడు. ఏమన్న కిందమీదకు అయ్యిందేమో. దేనికి మద్దతు ఇస్తుండో దాన్నే ఓడించాలంటుండు. అంత గతి తప్పి మాట్లాడొద్దు కదా. మెంటలయ్యిందేమో చూపీయండి" అని సెటైర్లు వేశారు.

తాను తెలంగాణకు కాపలా కుక్కలాగా పని చేస్తేనే 24 గంటల కరెంటును ఇవ్వగలుగుతున్నానని, చంద్రబాబు తన పాలనలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన శక్తితోనే తాను నాలుగేళ్లు పరిపాలన సాగించానని, ఇప్పుడు ప్రజా కూటమి రూపంలో పెనుముప్పు తెలంగాణను కబళించాలని చూస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆంధ్రాకు పోయిన బాబును, కాంగ్రెస్ నాయకులు నెత్తిన పెట్టుకుని తీసుకొస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణకు బాబు పెత్తనం అవసరం లేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News