Telangana: శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ కుమారుని కారులో భారీగా నగదు పట్టివేత!

  • పోలీసులు తనిఖీలు చేస్తున్న వేళ వచ్చిన కారు
  • కారులో సరైన పత్రాలు లేకుండా నగదు తరలింపు
  • భవ్య సిమెంట్స్ డైరెక్టర్ శివకుమార్ అరెస్ట్

మరో నాలుగు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, పోలీసులు తనిఖీలను విస్తృతం చేశారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి తెలుగుదేశం అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామికవేత్త భవ్య ఆనందప్రసాద్ కుమారుడి కారులో నిన్న రాత్రి రూ. 70 లక్షలు లభించినట్టు తెలుస్తోంది.

టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు జరుపుతున్న వేళ, ఈ కారులో సరైన లెక్కలు లేని నగదు కనిపించడంతో డబ్బును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. భవ్య సిమెంట్స్ డైరెక్టర్ శివకుమార్ తో పాటు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల వేళ కారులో భవ్య ఆనందప్రసాద్ గానీ, ఆయన కుమారుడుగానీ లేరు. కారు ఆయన కుమారుడి పేరిట రిజిస్టర్ అయివుంది. ఈ డబ్బు తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం తరలిస్తున్నట్టు శివకుమార్ వెల్లడించారు. డబ్బు ఎక్కడిదన్న విషయమై పత్రాలను అధికారులకు అందిస్తామన్నారు.

Telangana
Elections
Bhavya anandprasad
Cash
Son
Police
  • Loading...

More Telugu News