Pawan Kalyan: మాసిన గెడ్డం అంటే పవన్ కల్యాణ్‌ను తిట్టినట్టు కాదు: ఆపరేషన్ 2019 దర్శకుడి వివరణ
- సినిమా బాగున్నా నెగిటివ్ రివ్యూలు
- పవన్ నాకేమైనా డేట్స్ ఇస్తారా?
- మాసిపోయిన గడ్డం అంటే పవనేనా?
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ నటించిన ‘ఆపరేషన్ 2019’ సినిమాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తిట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని చిత్ర దర్శకుడు బాబ్జీ ఖండించారు. ‘మాసిపోయిన గడ్డంతో తిరిగితే ఓట్లు రాలవు’ అన్న డైలాగ్‌ను పవన్‌కు ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. ఆ డైలాగ్ సందర్భం ఏమిటో చూసి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికాడు.
ఈ సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నప్పటికీ రివ్యూలు వ్యతిరేకంగా రాయడాన్ని బాబ్జీ తప్పుబట్టాడు. తానీ సినిమాను దర్శకుడిగా ఫీలై తీయలేదని, బాధ్యతగల పౌరుడిగా తీశానని బాబ్జీ స్పష్టం చేశాడు. దేశ భవిష్యత్ యువత చేతిలో కాదు, ఓటరు చేతిలో ఉందని చెప్పడమే తన ఉద్దేశమన్నాడు. ఈ సినిమాను పవన్‌తో తీసి ఉంటే బాగుండేదని అంటున్నారని, పవన్ ఎందుకని ప్రశ్నించారు. ఆయన తనకు డేట్స్ ఇస్తారా? అని ప్రశ్నించాడు. మాట్లాడే మాటలకు, రాసే రాతలకు అర్థం ఉండాలని బాబ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని బాబ్జీ పేర్కొన్నాడు.