Revanth Reddy: రేవంత్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు

  • మంగళవారం కొడంగల్‌లో కేసీఆర్ సభ
  • అడ్డుకుంటానన్న రేవంత్ రెడ్డి
  • ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్

కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని ఆదేశించింది. ఎటువంటి చర్యలు తీసుకున్నారో సోమవారం లోగా వివరణ ఇవ్వాలని కోరింది.

కొడంగల్‌లో శనివారం రాత్రి రేవంత్ రెడ్డి భయాందోళనలు సృష్టించారని, నాలుగో తేదీన కేసీఆర్ సభను అడ్డుకుంటానని హెచ్చరించడంతోపాటు బంద్‌కు పిలుపునిచ్చి ప్రజలను ఆందోళనకు గురిచేశారని ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. రేవంత్ రెడ్డి అకారణంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియో ఆధారాలను సమర్పించింది. వాటిని పరిశీలించిన ఈసీ రేవంత్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

Revanth Reddy
Kodangal
TRS
Congress
EC
KCR
  • Loading...

More Telugu News