Pawan Kalyan: పవన్ కల్యాణ్ సభకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

  • కర్నూలు జిల్లా కొత్తపల్లె క్రాస్ వద్ద ఘటన
  • చావుబతుకుల్లో డ్రైవర్
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అనంతపురంలో నిర్వహించిన కవాతు, బహిరంగ సభకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న నలుగురు జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తపల్లె క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది. కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారును ఓల్వో బస్సు ఢీకొనడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే  మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాద విషయం తెలిసి పవన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతులను వెల్దుర్తి మండలం గోవర్థనగిరికి చెందిన హనుమన్న, గోవిందు, డోన్ మండలం ధర్మవరానికి చెందిన మధుగా గుర్తించారు. మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, తీవ్రంగా  గాయపడిన డ్రైవర్ మల్లికార్జున్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Pawan Kalyan
Anantapur District
Kurnool District
Done
Road Accident
  • Loading...

More Telugu News