Chandrababu: చంద్రబాబుకు మకిలి, వెకిలి రాజకీయాలెందుకు?: సీఎం కేసీఆర్

  • ప్రజల మధ్య చంద్రబాబు విభేదాలు సృష్టిస్తున్నారు
  • చంద్రబాబు ‘తెలుగు జాతి’ అని మాట్లాడతాడు
  • ఆ ‘తెలుగు జాతి’ హైదరాబాద్ లో హ్యాపీగా ఉంది

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని? మకిలి, వెకిలి రాజకీయాలెందుకు చేస్తున్నారు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ‘తెలుగు జాతి’ అని మాట్లాడతాడు. అయ్యా, చంద్రబాబునాయుడు గారు, మీ కొక నమస్కారం.. ‘తెలుగు జాతి’ అని ఏదైతే మాట్లాడుతున్నావో, హైదరాబాద్ లో హ్యాపీగా ఉన్నారు’ అని అన్నారు.

హైదరాబాద్ విశ్వనగరం అని, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని, కులీకుతుబ్ షా కాలం నుంచే సర్వమతాలకు, కులాలకు ఆలవాలంగా ఉన్న నగరమిదని అన్నారు. ఆంధ్రా, రాయలసీమకు చెందిన సోదరులు సంతోషంగా ఈ నగరంలో ఉన్నారని, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో చాలా అపోహలు సృష్టించారని అన్నారు. నాడు అనవసరమైన భయాలు సృష్టించారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అటువంటి అపోహలకు, భయాలకు తావు లేదని నిరూపించిందని అన్నారు. 

Chandrababu
kcr
TRS
Telugudesam
election campaign
  • Loading...

More Telugu News