South Sudan: దక్షిణ సూడాన్‌లో 10 రోజుల్లో 125 మందిపై అత్యాచారాలు!

  • సూడాన్‌లో మహిళలపై అత్యాచారాలు
  • బాలికలపై కూడా లైంగిక దాడి
  • దాడికి పాల్పడిన వారిలో మిలిటరీ సిబ్బంది

దక్షిణ సూడాన్‌లోని బెంటియూలో ఓ దారుణం వెలుగు చూసింది. అంతర్యుద్ధంతో రగులుతున్న సూడాన్‌లో మహిళలపై అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. పది రోజుల వ్యవధిలో 125 మంది మహిళలపై అత్యాచారం జరిగినట్టు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

గత పది రోజుల్లో మహిళలు, బాలికలపై కూడా లైంగిక దాడి జరిగినట్టు సంస్థ వెల్లడించింది. దాడికి పాల్పడిన వారిలో మిలిటరీ సిబ్బంది ఉండటం దారుణమని ఐక్యరాజ్యసమితి మిషన్ చీఫ్ డేవిడ్ షీర్ పేర్కొన్నారు. బాధితుల్లో ఎక్కువమంది గర్భిణులు, బాలికలు ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు.. మాటల్లో వెల్లడించలేనంత ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

South Sudan
Sexual Harassment
Pregnent Women
UNO
  • Loading...

More Telugu News