TRS: టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్

  • సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ప్రజాఆశీర్వాద సభ
  • ‘గ్రేటర్’లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థుల పరిచయం
  • హైదరాబాద్ ను గత పాలకులు సర్వనాశనం చేశారు

టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. మేనిఫెస్టో విడుదల అనంతరం, గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను కేసీఆర్ పరిచయం చేశారు.

 హైదరాబాద్ నగరాన్ని గత పాలకులు కమర్షియల్ దృష్టితో చూశారని, ప్రజలకు నివాసయోగ్యమైన నగరంగా చూడలేదని విమర్శించారు. అన్ని రంగాల్లోను నగరాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. కోటి మంది ఉన్న నగరంలో అధికారిక మార్కెట్లు ఏడు మాత్రమే ఉన్నాయని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే మంచి నిర్ణయం తీసుకోవాలని, గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదని, ప్రజల అభీష్టమని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకొచ్చాక  హైదరాబాద్ మహానగరంలో నల్లా బిల్లులను మాఫీ చేశామని, విద్యుత్ కొరత లేకుండా చేశామని, నాలుగేళ్లుగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు జరగలేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

TRS
election manifesto
kcr
secunderabad
  • Loading...

More Telugu News