Ajay Sunil Dhothe: పెళ్లయిన వెంటనే వరుడు మాయం.. అసలు విషయం తెలుసుకుని షాకైన బంధువులు

  • బాంద్రా కోర్టులో వివాహం చేసుకున్న అజయ్
  • ఊరేగింపు వేడుకలో అజయ్, అల్తాఫ్ మాయం
  • సెల్‌ఫోన్ దొంగలుగా గుర్తించి అరెస్ట్

పెళ్లయిన వెంటనే ఊరేగింపు జరుగుతుండగా పెళ్లికొడుకు మాయమయ్యాడు. ముంబైకు చెందిన అజయ్ సునీల్ ధోతే.. బాంద్రా కోర్టులో వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా అజయ్, అతని స్నేహితుడు అల్తాఫ్ మీర్జా ఇద్దరూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. అసలేం జరిగిందో తెలుసుకున్న బంధువులు షాకయ్యారు.

ఆ వివరాల్లోకి వెళితే, సోమవారం ఉదయం రోడ్డు పక్కన నడుస్తున్న ఓ మహిళ నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రూ.10 వేల విలువైన మొబైల్‌ను లాక్కెళ్లారు. వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు నిర్వహించిన పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులు అజయ్, అల్తాఫ్‌లుగా గుర్తించి పెళ్లి ఊరేగింపులోనే అరెస్ట్ చేశారు. వీరిపై గతంలో కూడా ఇలాంటి కేసే నమోదైందని సబ్ ఇన్‌స్పెక్టర్ బైల్ తెలిపారు.

Ajay Sunil Dhothe
Bandra Court
Mumbai
Marriage
MObile Phone
Police
  • Loading...

More Telugu News