Sonali Bendre: క్యాన్సర్‌పై నా పోరాటం ఇంకా పూర్తి కాలేదు..!: సోనాలి బింద్రే

  • నేను నా ఇంటికి బయలుదేరా
  • ఈ భావనను మాటల్లో చెప్పలేను
  • విరామం తీసుకోవడం ఆనందంగా ఉంది

క్యాన్సర్‌పై తన పోరాటం ఇంకా పూర్తి కాలేదని ప్రముఖ నటి సోనాలి బింద్రే తెలిపారు. ఆమధ్య తనకు క్యాన్సర్ అన్న విషయాన్ని తెలిపి అభిమానులకు షాక్ ఇచ్చిన సోనాలి.. ప్రస్తుతం చాలా వరకు కోలుకున్నారు. చికిత్స నిమిత్తం కొన్ని నెలల క్రితం న్యూయార్క్ వెళ్లిన సోనాలి ముంబైకి తిరిగి వస్తున్నట్టు ట్వీట్ చేసింది.

‘‘దూరం ప్రేమను పెంచుతుందంటారు. నిజమే.. కానీ అది మీకు నేర్పిన పాఠాన్ని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు చాలా కథలు చదివా. ఒక్కొక్కరు వారి కథను వివిధ రకాలుగా వర్ణించారు. ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు.. కానీ లక్ష్యాన్ని మాత్రం వదిలేయరు.

ఇప్పుడు నేను.. నా ఇంటికి బయలుదేరా. ఈ భావనను మాటల్లో చెప్పలేను. కానీ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. నా కుటుంబాన్ని, స్నేహితుల్ని మళ్లీ చూస్తున్నాననే ఆనందంలో ఉన్నా. ఇంకా క్యాన్సర్‌పై నా పోరాటం పూర్తి కాలేదు. కానీ ఇలా చిన్న విరామం తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ సోనాలి తన ఫొటోల్ని షేర్‌ చేశారు.

Sonali Bendre
Mumbai
Newyork
Twitter
Cancer
  • Loading...

More Telugu News