mim: నా ఆరోగ్యం అసలు బాగోలేదు..ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు: అక్బరుద్దీన్ ఒవైసీ

  • నా కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి
  • కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఉన్నాయి
  • డయాలసిస్ చేసుకోవాలని వైద్యులు సూచించారు

తన ఆరోగ్యం అసలు బాగోలేదని, బహుశ ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు కావొచ్చని ఎంఐఎం చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. యాకుత్ పుర ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, తన కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని, కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఉన్నాయని అన్నారు.

డయాలసిస్ చేసుకోవాలని వైద్యులు సూచించారని, కానీ, తనకు సమయం దొరకడం లేదని, తమ పాఠశాలలు, దారుసలాం బ్యాంకులు, ఆసుపత్రులు చూసుకోవడానికే సరిపోతోందని చెప్పారు. తన కోసం తానెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదని, తమ కమ్యూనిటికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే  పోటీ చేస్తున్నానని అన్నారు. తమ కమ్యూనిటీకి సేవ చేసేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నా తన స్థానాన్ని ఖాళీ చేస్తానని అక్బరుద్దీన్ చెప్పడం గమనార్హం.
 

mim
Akbaruddin Owaisi
chandrayana gutta
  • Loading...

More Telugu News