nagar kurnul: ఏడాదిలోగా వట్టెం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: సీఎం కేసీఆర్

  • పని చేసే వారికే అవకాశం కల్పించాలి
  • గుడ్డిగా ఓటేయొద్దు
  • బంగారు నాగర్ కర్నూల్ చేస్తా

టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తే ఏడాదిలోగా వట్టెం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, నాగర్ కర్నూల్ ని బంగారు నాగర్ కర్నూల్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ ను జిల్లాగా చేసి ప్రజలకు కానుకగా ఇచ్చానని, తమ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపించి ప్రజలు తనకు కానుకగా ఇవ్వాలని కోరారు.

గత పాలకులకు, తమకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని, దీనిని ఆధారంగా చేసుకుని ఓట్లు వేయాలని కోరారు. పని చేసే వారికే అవకాశం కల్పిస్తే, మరింతగా పని చేస్తారని, బంధువులు, కుల పెద్దలు చెప్పారని గుడ్డిగా ఓటేయొద్దని ప్రజలకు సూచించారు. నాగర్ కర్నూల్ కు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ లను తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

nagar kurnul
kcr
TRS
Congress
Telugudesam
  • Loading...

More Telugu News