kodangal: కొడంగల్ లో కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటాం: రేవంత్ రెడ్డి

  • ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ మరిచారు
  • ప్రజలు ఆశీర్వదిస్తేనే నేను ఈ స్థాయికి వచ్చా 
  • కొడంగల్ నియోజకవర్గాన్ని కాపాడుకుంటా 

ఈ నెల 4న కొడంగల్ లో కేసీఆర్ జరిపే పర్యటనను అడ్డుకుంటామని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ మరిచారని, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎవరికైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.

ప్రజలు ఆశీర్వదిస్తేనే తాను ఈ స్థాయికి వచ్చానని, తనను అడ్డుకోవడం హరీశ్ రావు, కేటీఆర్ లకు సాధ్యం కాకపోవడం వల్లే కేసీఆర్ రంగంలోకి దిగారని వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని కాపాడుకుంటానని, హైటెన్షన్ తీగలా రక్షించుకుంటానని రేవంత్ చెప్పడం గమనార్హం.

kodangal
kcr
TRS
t-congress
Revanth Reddy
  • Loading...

More Telugu News