Russia: ఐదేళ్ల బుడతడు - ఆరు రికార్డులు... అబ్బురపడి మెర్సిడిస్ బెంజ్ కారిచ్చిన పుతిన్!

  • రష్యాకు చెందిన చిన్నారి రఖీమ్ కురయేవ్
  • బాడీ బిల్డింగ్, పుషప్స్ లో రికార్డుల బద్దలు 
  • గంటలో 1,419 పుషప్స్ తో రికార్డు

ఐదేళ్ల వయసున్న చిన్నోడు ఏం చేస్తాడు? ఆకలైతే అన్నం తినడం, ఆడుకోవడం లేదంటే నర్సరీ స్కూలుకు వెళ్లడం. ఈ వయసులో ఉదయం నిద్ర లేవడానికి కూడా ఇష్టపడరు పిల్లలు. అటువంటిది రష్యాకు చెందిన రఖీమ్ కురయేవ్ అనే బుడతడు ఏకంగా బాడీ బిల్డింగ్, పుషప్స్ విషయాల్లో ఆరు రికార్టులు బద్దలు కొట్టాడు.

రఖీమ్‌ కురయేవ్‌, మారథాన్‌ సెషన్‌ లో 2.22 గంటల వ్యవధిలో అలుపెరగకుండా 3,202 పుల్‌ అప్స్‌ చేశాడు. అంతేకాదు 40.57 నిమిషాల్లో 1,000 పుషప్స్‌ చేశాడు. అంతేనా... గంటన్నర సమయంలో 2,000 పుషప్స్‌ చేశాడు. ఇంకో రౌండ్‌ లో గంటలోనే 1,419 పుషప్స్‌ చేసి పాత రికార్డులను బద్దలు కొట్టాడు. ఇతగాడి ప్రతిభను చూసిన వ్లాదిమిర్‌ పుతిన్ సర్కారు, ప్రభుత్వం తరఫున మెర్సిడిస్ బెంజ్ కారును బహుమతిగా అందించింది. దాంతో పాటు ఓ బొమ్మల దుకాణంలో తనకు నచ్చిన బొమ్మలను ఉచితంగా షాపింగ్‌ చేసే అవకాశం కూడా చిన్నారికి దక్కింది.

Russia
Body Building
Pushups
Record
Putin
  • Loading...

More Telugu News