Revanth Reddy: అసలు రేవంత్ ఇంటికే పోలీసులు వెళ్లలేదు: ఏడీజీ జితేందర్

  • రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు రాలేదు
  • యూసఫ్ పై వచ్చినందునే సోదాలు
  • అనుమానం వస్తే ప్రతిచోటా రైడింగ్
  • వెల్లడించిన అడిషనల్ డీజీ జితేందర్

పోలీసులు ఎవరూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలకు వెళ్లలేదని అడిషనల్ డీజీ జితేందర్ స్పష్టం చేశారు. కొడంగల్ లోని ఆయన ఇంట్లో సోదాలు జరగలేదని, ఆయన ఇంట్లో డబ్బుందని తమకు ఫిర్యాదులు అందలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన యూసఫ్ అనే నేత ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయన ఇంట్లో సోదాలు చేశామని, అనుమానం ఉన్న ప్రతిచోటా రైడింగ్స్ జరుపుతున్నామని ఆయన అన్నారు.

కొడంగల్ లో అధికార పార్టీ అభ్యర్థి అనుచరుల ఇళ్లలోనూ సోదాలు చేశామని గుర్తు చేశారు. కాగా, యూసఫ్ ఇంట్లో ఎంత డబ్బు దొరికిందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. నిన్న రాత్రి తన అనుచరుల ఇళ్లలో సోదాలు చేయడాన్ని నిరసిస్తూ, రేవంత్ రెడ్డి, ఆయన అభిమానులు, అనుచరులు ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.

Revanth Reddy
Police
Kodangal
Telangana
ADG
Jitender
  • Loading...

More Telugu News