Pakistan: అబ్బే.. పాక్ వెళ్లమని నాకు రాహుల్ చెప్పలేదు!: మాట మార్చేసిన సిద్ధూ!

  • పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్లా
  • అక్కడికి వెళ్లమని రాహుల్ నాకు చెప్పలేదు
  • నా అంతట నేనే వెళ్లా

పాకిస్థాన్ నిర్మిస్తున్న కర్తార్ పూర్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమానికి పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయమై విమర్శలు తలెత్తడంతో తమపార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ ఆదేశాల మేరకే తాను అక్కడికి వెళ్లానని చెప్పిన సిద్ధూ ఇప్పుడు మాటమార్చారు.

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం మేరకే తాను అక్కడికి వెళ్లాను తప్ప, తనను వెళ్లమని రాహుల్ చెప్పలేదంటూ యూటర్న్ తీసుకున్నారు. తనంతట తానే అక్కడికి వెళ్లానన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని, వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు వక్రీకరించొద్దని నెపాన్ని మీడియా మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు. 

Pakistan
kartarpur
Rahul Gandhi
siddhu
  • Loading...

More Telugu News