Uttam Kumar Reddy: టీఆర్ఎస్ 30 సీట్లకే పరిమితమవుతుంది: ఉత్తమ్

  • కూటమి 80 స్థానాలను సొంతం చేసుకుంటుంది
  • దోచుకున్న సొమ్ముతో గెలవాలనుకుంటున్నారు
  • కేసీఆర్‌ను, టీఆర్ఎస్‌ను ప్రజలే గద్దె దించాలి

ప్రజా కూటమి 80 స్థానాలను సొంతం చేసుకుంటుందని.. టీఆర్ఎస్ 30 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఉత్తమ్ విమర్శించారు. కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించలేని కేసీఆర్‌ను, టీఆర్ఎస్‌ను గద్దె దించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని గుర్తు చేశారు.

Uttam Kumar Reddy
TRS
KCR
Sonia Gandhi
Rahul Gandhi
  • Loading...

More Telugu News