Chandrababu: లగడపాటి.. చంద్రబాబుకి సీక్రెట్ ఏజెంటా ఏంటీ?: మంత్రి హరీశ్ రావు

  • చంద్రబాబు, లగడపాటి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి
  • ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లకుండా బాబు యత్నం
  • కాంగ్రెస్ పార్టీ  ప్రకటనలకు డబ్బులెవరు ఇస్తున్నారు?

తెలంగాణ ఎన్నికల్లో పది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారని ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. లగడపాటి.. చంద్రబాబుకు సీక్రెట్ ఏజెంటా ఏంటీ? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లగడపాటి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు.

 చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లకుండా ఉండేందుకని హోం శాఖను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా టీ-కాంగ్రెస్ పై ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రకటనలకు డబ్బులెవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రా నుంచి నోట్ల కట్టలు వస్తున్నాయని, ఆ డబ్బుతోనే పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలను కాంగ్రెస్ పార్టీ వేయిస్తోందని అన్నారు. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది అమరావతికి గులాంగిరి చేయడానికి కాదన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు.

Chandrababu
lagadapati
Harish Rao
  • Loading...

More Telugu News