Telangana: మంత్రి కేటీఆర్ ను కలుసుకున్న సైనా-కశ్యప్.. వివాహ రిసెప్షన్ కు రావాలని ఆహ్వానం!

  • మంత్రిని కలుసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు
  • తెలంగాణలో క్రీడల అభివృద్ధిపై చర్చ
  • డిసెంబర్ 16న పెళ్లి రిసెప్షన్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 16న నోవాటెల్ లో సాయంత్రం 6.30 గంటలకు జరగనున్న తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. తాను తప్పకుండా వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ట్విట్టర్ లో సైనా స్పందిస్తూ..‘మంత్రి కేటీఆర్ సార్ తో సమావేశం అద్భుతంగా సాగింది. తెలంగాణలో క్రీడల అభివృద్ధిపై చర్చించాం. మీరు మా పెళ్లి రిసెప్షన్ కు హాజరవుతారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేసింది.

Telangana
KTR
badminton
kasyap
Saina Nehwal
marriage
reception
invitation
  • Loading...

More Telugu News