Khammam District: వైరా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ను అడ్డుకున్న తండా వాసులు

  • లంబాడాలకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడారని ఆగ్రహం
  • ప్రచార వాహనం ముందు బైఠాయించి ఆందోళన
  • పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం

ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. ప్రచారానికి వెళ్లిన ఆయనను ఓ తండా వాసులు అడ్డుకున్నారు. జిల్లాలోని వైరా నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తున్న బానోతు మదన్‌లాల్‌ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్‌ తండాకు వెళ్లారు. ఆయనను ఊరిబయటే గ్రామస్థులు అడ్డుకుని వాహనం ముందు బైఠాయించారు.

కొంత కాలంగా లంబాడాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, ఆయనను గ్రామంలో ప్రచారం చేయనివ్వమని స్పష్టం చేశారు. దీంతో మదన్‌లాల్‌ వర్గీయులు, గ్రామస్థుల మధ్య కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. దీంతో మదన్‌లాల్‌ గ్రామంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్లిపోయారు.

Khammam District
yra
bhanothu madanlal
  • Loading...

More Telugu News