Errabelli: టీఆర్‌ఎస్‌ విజయం ఏకపక్షం... ఇందులో ఎటువంటి అనుమానం లేదు : ఎర్రబెల్లి

  • ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆశీర్వాద ఫలితం ఇది
  • మేనిఫెస్టోలో ప్రస్తావించని అంశాలు కూడా అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది
  • పాలకుర్తిలో 50 వేల ఓట్ల మెజార్టీతో విజయం ఖాయం

ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉండబోతోందని, టీఆర్‌ఎస్‌కు ఘనవిజయం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాయని, లబ్ధిదారుంతా టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

కాంగ్రెస్‌ కల్లబొల్లి మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటీ అమలు కాలేదన్నారు. అదే సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి ప్రజల మన్ననలు సొంతం చేసుకుందని తెలిపారు. పాలకుర్తిలో కేసీఆర్‌ సభతో ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడిందని, తాను 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందనున్నానని ధీమా వ్యక్తం చేశారు.

Errabelli
palakurthi
  • Loading...

More Telugu News