USA: అమెరికాను కుదిపేసిన భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరికలు జారీచేసిన అధికారులు!

  • అలాస్కాలో 7, 5.7 తీవ్రతతో భూకంపం
  • నేలకొరిగిన భవనాలు, దెబ్బతిన్న రోడ్లు
  • సునామీ హెచ్చరికల జారీ, ఉపసంహరణ

అగ్రరాజ్యం అమెరికాను వరుస భూకంపాలు వణికించాయి. అలాస్కా రాష్ట్రంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో పలు ఇళ్లు, భవనాలు నేలకొరిగాయి. అనంతరం కొద్ది నిమిషాల వ్యవధిలోనే మరోసారి 5.7 తీవ్రతో భూకంపం వచ్చింది. అలాస్కాలోని యాంకరేజ్ నగరానికి 11 మైళ్ల దూరంలో భూమి లోపల 21 కిలోమీటర్ల లోతుగా భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

భూకంపం సంభవించిన వెంటనే రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ,  భారీగా ఆస్తి నష్టం జరిగింది. భవనాలతో పాటు ఈ ప్రాంతంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా, భూకంపం నేపథ్యంలో తొలుత అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత సునామీ హెచ్చరికలను అధికారులు ఉపసంహరించారు.

  • Loading...

More Telugu News