Andhra Pradesh: వైఎస్ జగన్ ను కలిసిన తెలంగాణ బీజేపీ నేత.. ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి!

  • హైదరాబాద్ లో నంబూరి రామలింగేశ్వరరావు భేటీ
  • సత్తుపల్లిలో బీజేపీ టికెట్ పై పోటీచేస్తున్న నేత
  • వైసీపీ కేడర్ మద్దతు కోసం జగన్ తో సమావేశం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను బీజేపీ నేత నంబూరి రామలింగేశ్వరరావు కలుసుకున్నారు. సత్తుపల్లిలో బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న ఆయన జగన్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్ ను కోరినట్లు రామలింగేశ్వరరావు తెలిపారు.

సత్తుపల్లిలో వైసీపీ శ్రేణులు ఉన్నందున ఆ పార్టీ అధినేతను కలిసి మద్దతును కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో జగన్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈసారి సత్తుపల్లిలో బీజేపీ తరఫున తాను ఘనవిజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Telangana
YSRCP
Jagan
support
sattupally
namburi
ramalingeswararao
  • Loading...

More Telugu News