Andhra Pradesh: తెలంగాణలో ఓటేయనున్న 11 వేల మంది ఏపీ ఉద్యోగులు
- రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కేటాయింపు
- ఏపీలో విధులు.. తెలంగాణలో ఓటు హక్కు
- డిసెంబరు 7 సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఈ నెల 7న తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో 11 వేల మంది ఆంధ్రా ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారు ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్ రోజున ఏపీ ప్రభుత్వం వారికి సెలవు మంజూరు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
మొత్తం మూడువేల మంది ఉద్యోగులు ఏపీ సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలిలో పనిచేస్తున్నారు. వీరంతా ఏపీలోనే పనిచేస్తున్నప్పటికీ ఓటుహక్కు మాత్రం తెలంగాణలోనే ఉంది. మొత్తం 11 వేల మంది ఏపీ ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తెలంగాణలోనే నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా డిసెంబరు 7ను ఏపీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.