KCR: 'నీ తమ్ముడినైన నేను...’ అంటూ నాగమణిని సంబోధించిన కేసీఆర్‌!

  • కొత్తగూడెం సభలో సీఎం ఆసక్తికర ప్రసంగం
  • నాగమణి అనే ద్వితీయ శ్రేణి నాయకురాలికి కితాబు
  • అధికారంలోకి వస్తే అందలం ఎక్కిస్తానని హామీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటకు చెందిన నాగమణి అనే ద్వితీయ శ్రేణి నాయకురాలినుద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా వున్నాయి.  'నీ తమ్ముడినైన నేను...’ అని సంబోధించడంతో ఆశ్చర్యపోవడం సభికుల వంతయింది.

నాగమణి అక్క 2001 నుంచి టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, కానీ ఆమెకు ఐసీడీఎస్‌ రీజనల్‌ ఆర్గనైజర్‌గా సాధారణ పదవి ఇవ్వడం బాధగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెకు రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించి ఆదరిస్తానని మాటిచ్చారు.  

KCR
Bhadradri Kothagudem District
  • Loading...

More Telugu News