Asaduddin Owaisi: రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన ఒవైసీ

  • దమ్ము, ధైర్యం ఉంటే నాపై పోటీ చేసి గెలవండి
  • బిర్యానీ, మందు పంపిణీ చేసి రాహుల్ సభలకు జనాలను తీసుకొచ్చారు
  • కాంగ్రెస్, టీడీపీలు నిఖా చేసుకున్నాయి

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేసి తనపై గెలవాలని ఛాలెంజ్ చేశారు. పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. బిర్యానీ, మద్యాన్ని సరఫరా చేసి రాహుల్ సభలకు జనాలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు నిఖా చేసుకున్నాయని విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా మహాకూటమి అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. 

Asaduddin Owaisi
Rahul Gandhi
congress
mim
  • Loading...

More Telugu News