kanna laxminarayan: హోదాపై మాట్లాడితే చంద్రబాబు ఏజెంట్లు అంటారా?.. కన్నా ఖబడ్దార్: చలసాని

  • కన్నా.. నోరు అదుపులో పెట్టుకో
  • ఆరోపణలు వెనక్కి తీసుకో
  • ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేస్తోంది 

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన  వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. హోదా గురించి ఎవరు మాట్లాడినా వారు చంద్రబాబు ఏజెంట్లని మాట్లాడడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారిందని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.

 ఏపీకి, తెలుగు ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. బీజేపీకి ఉత్తర భారతదేశంపై ఉన్న శ్రద్ధ దక్షిణ భారతదేశంపై లేదని విమర్శించారు. యువతను, విద్యార్థులను మోసం చేసిన బీజేపీని దక్షిణాదిలో అడుగుపెట్టనిచ్చేది లేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతామని చలసాని హెచ్చరించారు.

kanna laxminarayan
Chalasani
Andhra Pradesh
BJP
Narendra Modi
Amit Shah
  • Loading...

More Telugu News