Raghuveera reddy: ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఒక రోజు పట్టింది.. చంద్రబాబు-రాహుల్ కలయికపై రఘువీరారెడ్డి

  • ఒంటరిగా పోటీ చేస్తే 40-50 సీట్లు కూడా రావు
  • రాహుల్ నిర్ణయమే ఫైనల్
  • ఒంటరిగా వెళ్లేందుకు కూడా రెడీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు-కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తొలిసారి కలుసుకున్నప్పుడు తాను షాక్‌కు గురయ్యానని, తేరుకునేందుకు ఒక రోజు పట్టిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఒంటరిగా పోటీ చేస్తే 40-50 సీట్లు కూడా రావని, అందుకనే చంద్రబాబు రాహుల్‌ను కలిశారని పేర్కొన్నారు.

శుక్రవారం అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రఘువీరా.. రాహుల్ గాంధీ నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు అంశాన్ని కూడా రాహుల్‌కే వదిలేస్తున్నట్టు చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా ముందుకెళ్లేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రఘువీరారెడ్డి తెలిపారు.

Raghuveera reddy
APCC
Andhra Pradesh
Chandrababu
Rahul Gandhi
  • Loading...

More Telugu News