t-congress: తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టాలి: స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి

  • కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా రుణం తీర్చుకుందాం
  • ఓట్లు చీలకూడదనే టీడీపీతో మా పొత్తు
  • పంచుతున్న డబ్బు తీసుకోండి కానీ, ఓటు మాకే వేయండి

తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పిలుపు నిచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, తమ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని అన్నారు.

 కాంగ్రెెస్-టీడీపీ కలయికపై వస్తున్న విమర్శలను ఈ సందర్భంగా ఆమె ఖండించారు. ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీతో తాము పొత్తు పెట్టుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో పంచుతున్న డబ్బు తీసుకోండి కానీ, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయాలని ప్రజలకు సూచించారు.

t-congress
vijayasanthi
bodhan
TRS
kcr
  • Loading...

More Telugu News