Revanth Reddy: రేవంత్ భద్రతపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

  • మరోసారి హైకోర్టును ఆశ్రయించిన రేవంత్
  • ఉత్తర్వులను సవరించాలని కోరిన కేంద్రం
  • 4 ప్లస్‌ 4 భద్రత, ఎస్కార్ట్‌ కల్పించాలని ఆదేశం

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ తన భద్రత విషయమై మరోసారి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ రేవంత్ రెడ్డి డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేశారు.

  తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని రేవంత్ పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కేంద్రం కోరింది. కేంద్రం అప్పీల్‌ను అంగీకరించిన న్యాయస్థానం.. రేవంత్‌కు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకూ 4 ప్లస్‌ 4 భద్రత, ఎస్కార్ట్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Revanth Reddy
Central Government
Telangana
High Court
Escort
  • Loading...

More Telugu News