rajani: '2.ఓ' అదుర్స్ అంటోన్న మహేశ్ బాబు

- ఇంతవరకూ ఇలాంటి సినిమా చూడలేదు
- శంకర్ కొత్త తరహాలో ఆలోచించారు
- సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను
శంకర్ దర్శకత్వంలో 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన '2.ఓ' నిన్ననే ప్రేక్షకులముందుకు వచ్చింది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా, ప్రతి ప్రాంతం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు అద్భుతం .. ఆశ్చర్యం అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలా శంకర్ టీమ్ ను అభినందిస్తోన్నవారి జాబితాలో మహేశ్ బాబు కూడా చేరిపోయాడు.
