Twitter: తెలంగాణకు మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే.. ఇందుకు మా మద్దతు కూడా అవసరం రాదు!: అసదుద్దీన్ ఒవైసీ

  • కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం రావాలి
  • తెలంగాణ మోడల్ దేశమంతా అమలుచేయాలి
  • ట్విట్టర్ లో స్పందించిన మజ్లిస్ అధినేత

తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) ఎన్నికవుతారని ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఇందుకు ఏఐఎంఐఎం మద్దతు అవసరం లేదని వెల్లడించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం పరిస్థితి దేశమంతా రావాలని ఆకాంక్షించారు. ఇటీవల తాను ఇచ్చిన ఇంటర్వ్యూను ఓ ఛానెల్ వక్రీకరించి శీర్షిక పెట్టడంపై ఒవైసీ ట్వీట్టర్ లో ఈ మేరకు స్పందించారు.

Twitter
Telangana
Chief Minister
Asaduddin Owaisi
aimim
KCR
next
support
TRS
  • Loading...

More Telugu News