Telangana: ‘తెలుగులో మాట్లాడటమే రావడం లేదు’ అన్న విమర్శలపై జవాబిచ్చిన నందమూరి సుహాసిని!

  • నేను హైదరాబాద్ లోనే చదువుకున్నా
  • ఇంట్లో అందరూ తెలుగులోనే మాట్లాడుతాం
  • మీడియాతో మాట్లాడిన మహాకూటమి అభ్యర్థి

ఇటీవల మీడియా సమావేశంలో, అలాగే ప్రచారంలో తెలుగులో మాట్లాడటానికి కూకట్ పల్లి మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని తీవ్రంగా ఇబ్బందిపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన విమర్శలపై నందమూరి సుహాసిని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడగలనని తెలిపారు. అయితే రాజకీయ పదజాలం, భాష తనకు ఇంకా అలవడలేదని వ్యాఖ్యానించారు. మీడియా సమావేశాలు, బహిరంగ సభల్లో ఇంగ్లిష్ పదాలు వాడకూడదని చెప్పడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. తామంతా ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. అలాగే తన చదువంతా హైదరాబాద్ లోనే సాగిందని పేర్కొన్నారు.

Telangana
kukatpalli
mahakutami
nandamuri
suhasini
telugu
language
speaking
issues
Hyderabad
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News