sushma swaraj: ఈ వయసులో సుష్మా స్వరాజ్ సిగ్గుపడుతున్నారు: అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి

  • పాక్ తో చర్చలు జరపబోమన్న వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన ఖురేషీ
  • చర్చలకు మేము సిద్ధంగా ఉన్నా.. భారత్ ముందుకు రావడం లేదు
  • ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసినప్పటికీ మోదీ స్పందించలేదు

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పై పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మొహమూద్ ఖురేషీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కర్తార్ పూర్ నడవా కు పాక్ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ, భారత్ కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలను ఆపేంత వరకు పాక్ తో ఎలాంటి చర్చలు జరపమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఖురేషీ స్పందిస్తూ, చర్చలు జరపబోం అని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. ఈ వయసులో సుష్మాస్వరాజ్ సిగ్గుపడుతున్నారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్ తో చర్చలకు తాము సుముఖంగా ఉన్నప్పటికీ... ఆ దేశమే ముందుకు రావడం లేదని చెప్పారు. ఇదే విషయమై భారత ప్రధాని మోదీకి పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని విమర్శించారు. న్యూయార్క్ భేటీని కూడా రద్దు చేసిందని అన్నారు. 

sushma swaraj
shah mehmood qureshi
pakistan
india
  • Loading...

More Telugu News