lagadapati rajagopal: రెండు స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారో వెల్లడించిన లగడపాటి... రోజుకు ఇద్దరి పేర్లు వెల్లడిస్తానన్న ఆంధ్ర ఆక్టోపస్!

  • ప్రధాన పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లొంగడం లేదు
  • 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారు
  • నారాయణపేట్, బోథ్ లలో స్వతంత్ర అభ్యర్థులదే విజయం

తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లొంగడం లేదని ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ప్రజలు ఓట్లు వేయబోతున్నారని తెలిపారు. 8 నుంచి 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు.

ఈ క్రమంలో నారాయణపేట్, బోథ్ లలో ఇండిపెండెంట్లు గెలబోతున్నారని తెలిపారు. బోథ్ లో అనిల్ జాదవ్, నారాయణపేట్ లో శివకుమార్ లు గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. పలుచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు.  రోజుకు ఇద్దరు గెలిచే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తానని చెప్పారు. డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

lagadapati rajagopal
surevy
telangana
results
  • Loading...

More Telugu News