Warangal Rural District: టీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయం : పరకాల కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ

  • రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామనడం విడ్డూరం
  • ఎంతమందికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారో ధర్మారెడ్డి చెప్పాలి
  • మీ ఆడబిడ్డగా మళ్లీ గెలిచి రుణం తీర్చుకుంటానని స్పష్టీకరణ

ముందస్తు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని పరకాల నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిని కొండా సురేఖ జోస్యం చెప్పారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల నియోజకవర్గం పరిధిలోని సంగెం మండలం గాంధీనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.

నియోజకవర్గంలో పన్నెండు వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని చల్లా ధర్మారెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఎంతమందికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారో ఆయన చెప్పాలని నిలదీశారు. కొండా దంపతులపై అభిమానంతో నియోజకవర్గం ప్రజలు తనకు నీరాజనం పడుతున్నారని, ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి మీ ఆడబిడ్డగా రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ఆమె వెంట పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

Warangal Rural District
parakala
Konda Surekha
  • Loading...

More Telugu News