Jagtial District: సీమాంధ్రుల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌

  • ధర్మపురి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం
  • అభివృద్ధిని చూసి ఓటేయాలని వినతి
  • కూటమికి ఓటేసి రాష్ట్రాన్ని చీకట్లలోకి నెట్టవద్దని పిలుపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు సీమాంధ్రుల పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, మహాకూటమికి ఓటేసి అటువంటి పరిస్థితి మరోసారి మనం తెచ్చుకోకూడదని ధర్మపురి నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

జగిత్యాల జిల్లాలోని తన నియోజకవర్గం పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. మహా కూటమికి ఓటేసి చేజేతులా రాష్ట్రాన్ని చీకట్లలోకి నెట్టవద్దని పిలుపునిచ్చారు.

Jagtial District
dharmapuri
Koppula Eshwar
  • Loading...

More Telugu News