chiranjeevi: సమ్మర్ రేసు నుంచి తప్పుకున్న 'సైరా'

  • షూటింగు దశలో 'సైరా'
  • గ్రాఫిక్స్ కి ఎక్కువ సమయం 
  • దసరాకి విడుదలయ్యే ఛాన్స్ 

మొదటి నుంచి కూడా వివిధ కారణాల వలన 'సైరా' షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. భారీ సెట్ల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం .. భారీ చారిత్రక నేపథ్యం కలిగిన కథా వస్తువు కావడం వలన అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేకపోవడం జరుగుతోంది. దాంతో దర్శక నిర్మాతలు ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయాలని భావించారు. అయితే ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందనేది తాజా సమాచారం.

ఈ సినిమాకి భారీస్థాయిలో గ్రాఫిక్స్ అవసరం కానున్నాయి. అనుకున్న స్థాయిలో అవుట్ పుట్ రావాలంటే 6 నెలలు వేచి వుండవలసిందేనని సురేందర్ రెడ్డి చెప్పాడట. దాంతో ఈ సినిమాను వేసవికి విడుదల చేయడం కష్టమే అవుతుంది గనుక, దసరా సెలవుల్లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. సెలవుల్లో అయితే రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువగా వుంటారనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.  

chiranjeevi
nayanathara
  • Loading...

More Telugu News