ram mandir: అయోధ్యలో రామమందిరం కోసం ఆరెస్సెస్ రథయాత్ర.. రేపటి నుంచి ప్రారంభం!
- 9 రోజుల పాటు సాగనున్న రథయాత్ర
- బహిరంగ సభ నిర్వహించనున్న వీహెచ్ పీ
- కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు హిందుత్వ సంస్థల వ్యూహం
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రామమందిరం నిర్మాణం డిమాండ్ ఊపందుకుంటోంది. ఇందుకోసం అయోధ్యలో మందిర నిర్మాణానికి హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చురుగ్గా పావులు కదుపుతోంది.
తాజాగా రేపటి నుంచి 9 రోజుల పాటు ఢిల్లీ నుంచి అయోధ్య వరకూ ‘సంకల్ప్ రథయాత్ర’ను నిర్వహించనున్నట్లు ఆరెస్సెస్ ప్రకటించింది. అయోధ్యపై దేశ ప్రజల్లో ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని వెల్లడించింది. కాగా, ఈ రథ యాత్ర ముగిసే డిసెంబర్ 9న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.
రామమందిరం-బాబ్రీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు 2019, జనవరికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మందిరాన్ని నిర్మించేందుకు వీలుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆరెస్సెస్, వీహెచ్ పీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.