kcr: కేసీఆర్ తో ఇన్నాళ్లు అందుకే కలిసి ఉన్నా: వినోద్ కుమార్

  • కేసీఆర్ తొలి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రమే
  • లేకపోతే ఆయనను నేను ఎప్పుడో వదిలేసి వెళ్లేవాడిని
  • పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రమే తొలి ప్రాధాన్యమని చెప్పారు. అందుకే ఇన్నాళ్లుగా ఆయనతోనే కలిసి ఉంటున్నానని, లేకపోతే ఎప్పుడో వదిలేసి పోయేవాడినని అన్నారు.

టీపీసీఏ ఎగ్జిక్యూటివ్ (పెన్షనర్లు) సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. పెన్షనర్ల సమస్యలపై కేసీఆర్ తో తాను మాట్లాడతానని తెలిపారు. దేశంలోనే నెంబర్ వన్ లౌకికవాద ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, మహ్మద్ సలీం తెలిపారు.

kcr
vinod kumar
TRS
  • Loading...

More Telugu News