Suman: విజయశాంతి దారి విజయశాంతిది, నాదారి నాది: సినీ నటుడు సుమన్

  • తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ కు మద్దతు
  • పార్టీలు మారడం విజయశాంతి వ్యక్తిగతం
  • అన్నీ ఆలోచించుకునే ఉంటారన్న సుమన్

రాజకీయ పార్టీలకు మద్దతిచ్చే విషయంలో విజయశాంతి దారి విజయశాంతిదేనని, తన దారి తనదేనని ప్రముఖ సినీ నటుడు సుమన్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ మరోమారు అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, ఆమె గతంలో చాలా పార్టీలు మారారని, అది ఆమె వ్యక్తిగతమని అన్నారు. ఆమె తనకు 30 సంవత్సరాలుగా తెలుసునని, మంచి మనసున్న మహిళని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా అన్నీ ఆలోచించే చేస్తారన్న నమ్మకముందని అన్నారు.

రాజకీయాల్లో భాగంగా చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డ సుమన్, తాను ఉద్యమం సమయం నుంచే టీఆర్ఎస్ కు మద్దతిస్తూ వచ్చానని, ఏ పదవులనూ ఇప్పటివరకూ ఆశించలేదని చెప్పారు. ఏదైనా రాసుంటే భవిష్యత్తులో పదవులు వాటంతట అవే వస్తాయని సుమన్ వ్యాఖ్యానించారు.

Suman
Telangana
Vijayasanti
  • Loading...

More Telugu News