India: భారత్ లో అమెజాన్ ఉద్యోగాల జాతర.. భారీగా నియామకాలు చేపట్టనున్న సంస్థ!

  • టెక్నాలజీ, నాన్ టెక్నాలజీ రంగంలో నియామకాలు
  • హైదరాబాద్ లో 374 మంది అభ్యర్థులకు ఛాన్స్
  • వివరాలు వెల్లడించిన అమెజాన్ కంపెనీ వర్గాలు

అమెరికా రిటైల్, టెక్ దిగ్గజం అమెజాన్ భారత్ లో భారీ నియామకాలకు తెరతీసింది.  టెక్నాలజీ, నాన్ టెక్నాలజీ రంగంలో భారత్ లో విస్తరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2,000 మంది ఉద్యోగులను భారత్ లో నియమించుకోనున్నట్లు కంపెనీ సీనియర్ హెచ్ఆర్ డైరెక్టర్ దీప్తి తెలిపారు. ప్రస్తుతం భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో 50 శాతం టెక్, మరో 50 శాతం నాన్ టెక్నాలజీ రంగానికి చెందినవి ఉన్నట్లు వెల్లడించారు.

అమెజాన్.కాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్.ఇన్‌తోపాటు డివైసెస్ డివిజన్‌ సహా దేశంలోని పలు విభాగాల్లో ఈ నియామకాలు చేపడతామన్నారు. వీటిలో హైదరాబాద్ లో 374 ఖాళీలు, బెంగళూరులో 587 ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్‌ డెవలప్ మెంట్ ఇంజనీర్, ప్రోగ్రామ్ మేనేజర్ -బిజినెస్‌ క్వాలిటీ, వెండార్‌ ఆపరేషన్స్ అసోసియేట్, మేనేజర్, రిస్క్ ఇన్వెస్టిగేషన్స్, క్వాలిటీ అస్యూరెన్స్ టెక్నీషియన్, అమెజాన్ యాప్‌స్టోర్, బిజినెస్ ఎనలిస్ట్, అసోసియేట్ సైట్ మెర్చాండైజర్, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News