pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రేమకథలు ఇష్టమంటున్న పూజాహెగ్డే
  • కమల్ 'భారతీయుడు 2' అప్ డేట్స్ 
  • నాని తదుపరి చిత్రం ప్రత్యేకత 
  • రాజమౌళి సినిమాలో ప్రియమణి

*  తనకి ప్రేమకథలంటే చాలా ఇష్టమని చెబుతోంది అందాల నాయిక పూజా హెగ్డే. "ప్రస్తుతం పెద్ద హీరోలతో కమర్షియల్ యాక్షన్ చిత్రాలలోనే నటిస్తున్నప్పటికీ నాకు వ్యక్తిగతంతా ప్రేమకథ లంటే చాలా ఇష్టం. అలాంటి కథలు వస్తే మాత్రం వదులుకోను. ఇక నేను చేస్తున్న ప్రతి చిత్రాన్ని ఆస్వాదిస్తూనే చేస్తున్నాను' అని చెప్పింది పూజ.
*  కమలహాసన్, శంకర్ ల కాంబినేషన్లో రూపొందే 'భారతీయుడు 2' చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 నుంచి జరుగుతుంది. రాయలసీమలోని పలు ప్రాంతాలలో కూడా షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా నటించే అవకాశం వుంది.
*  ప్రస్తుతం చేస్తున్న 'జెర్సీ' చిత్రం తర్వాత హీరో నాని తన తదుపరి చిత్రాన్ని విక్రంకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
*  ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ప్రముఖ నటి ప్రియమణి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి రూపొందించిన 'యమదొంగ' చిత్రంలో ప్రియమణి నాయికగా నటించిన సంగతి విదితమే.  

pooja
Kamal Haasan
Kajal Agarwal
ntr
  • Loading...

More Telugu News