Revanth Reddy: నన్ను హతమార్చేందుకు పోలీసులను రంగంలోకి దింపారు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ

  • మఫ్టీలోని పోలీసులు ఏ క్షణమైనా దాడిచేయొచ్చు
  • నరేందర్ బంధువుల ఇంట్లో దొరికింది రూ. 51 లక్షలు కాదు..  రూ. 17.51 కోట్లు
  • కొడంగల్‌లో ఎన్నికలు వాయిదా వేసే కుట్ర

తనను హతమార్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సుశిక్షితులైన పోలీసులతో తనను హత్య చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, అందుకోసం పోలీసులను రంగంలోకి దింపిందని ఆరోపించారు. మఫ్టీలోని పోలీసులు తనపై దాడికి పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. కేసీఆర్ పంపుతున్న డబ్బును పోలీసుల వాహనాల్లో పెద్ద మొత్తంలో తరలిస్తున్నారని, ఇందుకు డీజీపీ మహేందర్ రెడ్డి సాయం చేస్తున్నారని ఆరోపించారు.

కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి బంధువుల ఇళ్లలో మంగళవారం జరిగిన ఐటీ దాడుల్లో మొత్తం రూ.17.51 కోట్ల నగదు పట్టుబడితే అధికారులు మాత్రం రూ. 51 లక్షలు మాత్రమే పట్టుబడ్డాయని చెబుతున్నారని అన్నారు. డబ్బు బదిలీ జరిగిందన్న సాకుతో కొడంగల్‌లో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy
Kodangal
Telangana
KCR
TRS
Congress
  • Loading...

More Telugu News