lalu prasad yadav: విడాకుల పిటిషన్ ని ఉపసంహరించుకున్న తేజ్ ప్రతాప్ యాదవ్

  • ఆనందం వ్యక్తం చేస్తున్న రెండు కుటుంబాలు
  • పాట్నా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ ఇటీవల దాఖలు  
  • ఆరు నెలల క్రితం తేజ్-ఐశ్వర్యల వివాహం

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన భార్య ఐశ్వర్యా రాయ్ కు విడాకులు ఇవ్వాలన్న ఆలోచనన విరమించుకున్నారు. పాట్నా ఫ్యామిలీ కోర్టులో ఇటీవల దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ను ఈరోజు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, తేజ్ ప్రతాప్ యాదవ్- ఐశ్వర్యారాయ్ ల వివాహం ఆరు నెలల క్రితం జరిగింది. తన భార్యతో తాను అడ్జస్ట్ కాలేకపోతున్నానని కోర్టులో ఇటీవలే ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే ఈ వివాహం చేసుకున్నానని మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇంటి ముఖం చూడని తేజ్ ప్రతాప్, వారణాసి, హరిద్వార్ లో ఉన్నారు.

lalu prasad yadav
tej pratap yadav
Aishwarya Rai
  • Loading...

More Telugu News